UAE లో లేబర్ వసతి నమోదుకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌

- January 19, 2022 , by Maagulf
UAE లో లేబర్ వసతి నమోదుకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌

యూఏఈ: ఆరోగ్యం, భద్రత మార్గదర్శకాలను పాటిస్తూ ఏర్పాటు చేసే లేబర్ వసతి గృహాలను సులువుగా అనుసంధానించేందుకు వీలుగా మానవ వనరులు, ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా మేనేజ్ మెంట్లు, ఇతరులు కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలకు సులువుగా అనుమతి పొందవచ్చు. ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ఇబ్రహీం అబ్దుల్ రెహమాన్ అల్-అమ్మారి మాట్లాడుతూ.. కార్మిక వసతి గృహాలలో మార్గదర్శకాలు అమలును తెలుసుకునేందుకు మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ http://www.mohre.gov.aeలో కంపెనీలు తమ లేబర్ వసతి సముదాయాన్ని నమోదు చేసుకోవచ్చన్నారు. దీంతో సురక్షితమైన వసతి సులభంగా అద్దెకు లభిస్తుంది. మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి వ్యక్తికి కనీసం 3 చదరపు మీటర్ల స్థలం, ఎయిర్ కండిషన్, మంచి వెంటిలేషన్, మెడికల్ టెస్టింగ్ రూమ్, సఫరేట్ కిచెన్ కలిగి ఉండాలి. వసతి గృహాల్లో వంట చేయడం, కుకింగ్ చేయడాన్ని నిషేధించబడిందని అల్-అమ్మారి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com