వరుణ్ బర్త్ డే స్పెషల్.. పవర్ ఆఫ్ ‘గని’ టీజర్
- January 19, 2022
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈరోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ ‘పవర్ ఆఫ్ గని’ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో సునీల్ శెట్టి… వరుణ్‌తేజ్‌కు బాక్సింగ్‌లో కోచింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది యోధులుగా తయారవుతారు… కానీ గని యోధుడిగా పుట్టాడు అని ఈ టీజర్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
కాగా గని చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న తమన్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కరోనా వల్ల వాయిదా పడిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్