అపరిచితుడితో గేమ్ ఆడిందని భార్యపై కేసుపెట్టిన భర్త
- January 20, 2022
బహ్రెయిన్: తన భార్య ప్రవర్తన బాగాలేదని, ఇద్దరు కుమార్తెల బాధ్యతను తనకు అప్పగించాలని షరియా కోర్టులో ఓ భర్త వేసిన దావాను కోర్టు తిరస్కరించింది. తన భార్య ఓ పరాయి వ్యక్తిని బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చి ప్లేష్టేషన్ లో గేమ్ ఆడిందని సదరు భర్త ఆరోపించాడు. అయితే, సదరు వ్యక్తి ఆరోపణల్లో నిజాయితీ లేదని, సమర్పించిన సాక్ష్యాల్లో వాస్తవాలు కన్పించడం లేదని షరియాకోర్టు అభిప్రాయపడింది. కోర్టు ఫైల్‌ల ప్రకారం.. భార్య న్యాయవాది ఖోలౌద్ మజ్లూమ్ వాదనలు విన్పిస్తూ.. తన క్లయింట్ 2013లో వాదిని వివాహం చేసుకున్నారని, అతని నుండి ఇద్దరు కుమార్తెలకు (3 మరియు 5 సంవత్సరాల వయస్సు) జన్మనిచ్చారని, వారు 2020లో జారీ చేసిన తీర్పు ప్రకారం ఆమె కస్టడీలో ఉన్నారని చెప్పారు. భార్యపై అనుమానంతో ఆమెను గాయపరిచాడని, ఆమె గౌరవానికి ఇబ్బంది కల్గించాడని, అందరి ముందు ఆమె పరువు తీసే లక్ష్యంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని కోర్టులో బలంగా వాదించాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!