ఒమన్, ఖతార్ పన్నుల ఒప్పందానికి ఆమోదం

- January 20, 2022 , by Maagulf
ఒమన్, ఖతార్ పన్నుల ఒప్పందానికి ఆమోదం

మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ద్వంద్వ పన్నును నివారించడం, ఆదాయం, మూలధన పన్ను ఎగవేతలను నిరోధించడంపై జరిగిన ఒప్పందానికి ఆమోదించారు. ఈ మేరకు సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ డిక్రీ నంబర్ 4/2022ను జారీ చేశారు. గతేడాది నవంబర్ 22న దోహాలో మజ్లిస్ అషురా ముందు ఈ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 1 ప్రకారం ఈ డిక్రీకి జోడించిన సంస్కరణకు అనుగుణంగా ఒప్పందాన్ని ధృవీకరిస్తుంది. ఆర్టికల్ 2.. ఈ డిక్రీ అధికారిక గెజిట్‌లో ప్రచురించబడుతుందని,   జారీ చేసిన తేదీ నుండి ఇది అమలులోకి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com