నాకు అండగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి: కైకాల
- January 20, 2022
హైదరాబాద్: టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులంతా ఆయన్ని హాస్పిటల్ కి వెళ్లి చూసి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆయనకు, ఆయన కుటుంబానికి సహాయం అందించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తూ లేఖ రాశారు.
కైకాల సత్యనారాయణ హాస్పిటల్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి లేఖ రాశారు. ఈ లేఖలో… నేను ఆసుపత్రిలో ఉన్న సమయంలో నాకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ కృతఙ్ఞతలు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధ పట్ల నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది. జగన్ గారు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుంది. అనారోగ్యం పాలైనప్పటి నుంచి అండగా ఉన్నందుకు నేను మరోసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే నేను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన నా అభిమానుల వల్లే నేను మళ్ళీ మాములు మనిషినయ్యాను.” అని రాశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..