దాసరి అరుణ్ అరెస్ట్!

- January 20, 2022 , by Maagulf
దాసరి అరుణ్ అరెస్ట్!

హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మన మధ్య లేకపోయినా తరచుగా ఆయన కుమారులు పలు వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. లేటెస్ట్‌గా దాసరి రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు దాసరి అరుణ్ కుమార్.

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని సయ్యద్ నగర్‌లో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో దాసరి అరుణ్ కుమార్‌పై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది. ఈరోజు(20 జనవరి 2022) తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టారు దాసరి అరుణ్ కుమార్. ఈ సమయంలో డ్రింక్ చేసి డ్రైవ్ చేసినట్లుగా గుర్తించారు బంజారాహిల్స్ పోలీసులు. దాంతో కారును సీజ్ చేశారు.

దాసరి అరుణ్ కుమార్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్ట్ 1988 ఐపీసీ section 185 & 336 కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కేసు నమోదు చేసిన అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అరుణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడిగినట్టు నిర్దారించారు పోలీసులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com