మనుషుల అక్రమ రవాణా: ముగ్గురి అరెస్ట్

- January 20, 2022 , by Maagulf
మనుషుల అక్రమ రవాణా: ముగ్గురి అరెస్ట్

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, మనుషుల అక్రమ రవాణాకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇంక్వైరీస్ మరియు ఇన్వెస్టిగేషన్స్ విభాగం ముగ్గురు విదేశీయుల్ని మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఉద్యోగ అవకాశాల పేరుతో నిందితులు, అమాయకుల్ని మోసం చేసి మానవ అక్రమ రవాణాకి పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com