భారతీయుల మృతదేహాలు పంజాబ్‌కు తరలింపు

- January 21, 2022 , by Maagulf
భారతీయుల మృతదేహాలు పంజాబ్‌కు తరలింపు

యూఏఈ: అబుధాబిలో హౌతీ మిలిటెంట్ల దాడిలో మరణించిన ఇద్దరు భారతీయుల  మృతదేహాలను శుక్రవారం పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి తరలించనున్నట్లు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రకటించారు. జనవరి 17 జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు రాయబార కార్యాలయం అన్ని లాంఛనాలను పూర్తి చేసిందన్నారు. అలాగే  దాడిలో మరణించిన పాకిస్తానీ జాతీయుడి మృతదేహాన్ని గురువారం ఉదయం స్వదేశానికి తరలించినట్లు పాకిస్తాన్ మిషన్‌లోని ఒక అధికారి తెలిపారు. సోమవారం క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించిన యెమెన్ తిరుగుబాటుదారులు చేసిన దాడిలో ముగ్గురు వ్యక్తులు - ఇద్దరు భారతీయులు, ఒక పాకిస్థానీ  మరణించారు. కాగా మరో ఆరుగురు గాయపడ్డ విషయం తెలిసిందే. ముసఫాలోని మూడు అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) ట్యాంకర్లు ఈ దాడిలో దెబ్బతిన్నాయి. మరో దాడిలో అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి, అరబ్ లీగ్ వంటి ప్రపంచ సంస్థలు పౌర కేంద్రాలపై దాడిని తీవ్రంగా ఖండించాయి.ఈ సంఘటన తర్వాత, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, సోమవారం నాటి డ్రోన్ దాడిలో భారతీయుల ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ తన యూఏఈ కౌంటర్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com