800 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీస్
- January 21, 2022
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు.వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.1.80 కోట్ల విలువ చేసే 800 కిలోల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిపెన్ రవీంద్ర శుక్రవారం నిందితుల వివరాలను మీడియాకు వెల్లడించారు.వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది స్మగ్లర్లు ఒక ముఠాగా ఏర్పడి.. ఒడిశాలోని కొరపుట్ నుంచి మహారాష్ట్రలోని నాసిక్ కు గంజాయిని తరలిస్తున్నారు. అల్లం రవాణా మాటున నిందితులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు, మియాపూర్ పోలీసుల సహకారంతో ఈముఠాను పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు ప్రధాన నిందితులు వికాస్ జాధవ్, సుభాష్ కుమార్ లు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 800 కిలోల గంజాయిని, గంజాయి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు నిందితులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వీరు ఒక కేజీ గంజాయిని రూ.3 వేలకు కొనుగోలు చేసి రూ.20 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలో ప్రధాన నిందితుడు వికాస్ జాధవ్ ఈ అక్రమ దందాకు లీడర్ గా వ్యవహరిస్తున్నాడని, పరారీలో ఉన్న అతన్ని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2021 మరియు 2022 జనవరి 20వ తేదీ వరకు మొత్తం 222 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 459 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పదే పదే డ్రగ్స్ దందా చేస్తున్న 25 మంది పై పిడి యాక్ట్ నమోదు చేశారు. ఈమొత్తం కేసులకు సంబందించి నిందితుల నుంచి.. గంజాయి – 2863.09 కేజీలు, గంజాయి మొక్కలు 128(మొక్కలు బరువు 37.3కేజీలు),గంజాయి మాత్రలు – 14, హషీష్ ఆయిల్ – 8.63 లీటర్లు, లూస్ వీడ్ ఆయిల్ పేస్ట్ – 200 గ్రాములు, LYRICA 150mg – 12 మాత్రలు, ఆల్ప్రజోలం 141 కి.గ్రా, MDMA-240.29 గ్రాములు, నల్లమందు 200 గ్రాములు, ఎక్స్టసీ మాత్రలు- 61 మాత్రలు, LSD 47 పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!