సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాసిన రేవంత్రెడ్డి
- January 21, 2022
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. తెలంగాణలో అకాల వర్షాలకు దెబ్బతిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని లేఖలో కోరారు. ప్రధానంగా మిర్చి రైతులకు ఎకరాకు 50వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మిగిలిన పంటలకు ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. తామర తెగులుతో..మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో... 25 లక్షల ఎకరాల్లో భారీ నష్టం వచ్చిందని తెలిపారు. కేంద్రం ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. రైతుల్ని వెంటనే ఆదుకోకపోతే.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యచరణ చేపడతామని అల్టిమేటం ఇచ్చారు రేవంత్ రెడ్డి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..