బాలయ్య అన్‌స్టాపబుల్.. మహేష్ ఎమోషనల్..!
- January 21, 2022
హైదరాబాద్: 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' అంటూ ఆహా ఓటీటీలో హోస్ట్‌గా ఆదరగోడుతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఇప్పటివరకు ఆయన చేసిన ఎపిసోడ్ లకి అత్యధిక వ్యూస్‌తో పాటుగా మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇప్పుడీ ఈ షో ఫైనల్‌కి చేరింది. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతిధిగా వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మహేష్‌తో పాటుగా టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా విచ్చేశారు.
గ్రాండ్ ఫినాలేలో బాలయ్య, మహేశ్‌ల మధ్య సాగిన సంభాషణఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిన్నారుల హార్ట్ ఆపరేషన్ లపైన మహేష్ స్పందించాడు. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కేవలం అరచేయి అంత ఉన్నాడని, తనకు డబ్బు ఉండటం వల్ల వైద్యం చేయించుకున్నామని, లేని వాళ్ల పరిస్థితి ఏంటనిపించిందని అన్నారు మహేష్. అందుకే చిన్నారుల హార్ట్ ఆపరేషన్ కోసం తన వంతు సాయం చేస్తున్నట్లుగా తెలిపారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుండగా ఫుల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..