BSNLలో ఉద్యోగాలు
- January 22, 2022
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లీగల్ ప్రొఫెషనల్స్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. అయితే ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మొదట కాంట్రాక్ట్ గడువు ఏడాది ఉంటుంది. అభ్యర్థుల పెర్ఫామెన్స్‌ని బట్టి కాంట్రాక్ట్ గడువును 2,3 ఏళ్లు పొడింగించే అవకాశం ఉంటుంది.
LLB చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్ధులు తప్పనిసరిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొంది ఉండాలి. LLBలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. మూడేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.75 వేల వేతనం ఉంటుంది. ఏ ఇతర అలవెన్స్‌లు ఇవ్వబడవని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్ధులు బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్, న్యూ ఢిల్లీలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు వెబ్‌సైట్ http://www.bsnl.co.in చూడొచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







