ఏపీ కరోనా అప్డేట్
- January 22, 2022
అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఏపీ వైద్యారోగ్య అధికారులను కలవరానికి గురి చేస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఈరోజు 43,763 శాంపిల్స్‌ను పరీక్షించగా 12,926 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు ప్రభుత్వం పరీక్షల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. కరోనాతో ఈ రోజు ఆరుగురు మృతి చెందారు. విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒక్కరు మరణించారు.
గడిచిన 24 గంటల్లో కోవిడ్ నుంచి 3,913 మంది సంపూర్ణంగా కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,21,00,381 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 73,143 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 78 , 513 లక్షలకు చేరింది. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







