నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ లో ఉద్యోగాలు..

- January 23, 2022 , by Maagulf
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ లో ఉద్యోగాలు..

ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (NIN) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖకి చెందిన ఈ సంస్థ హైద‌రాబాద్ క్యాంప‌స్‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

  • నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
  • వీటిలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫిజియాలజీ) 01, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఫార్మ్‌ డి) 02, ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అటెండెంట్ – 01 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.
  • పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఫార్మ్‌డీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
  • వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
  • అభ్య‌ర్థుల వ‌య‌సు పోస్టుల‌ను అనుస‌రించి 25 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

  • ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తుల‌ను డైరెక్టర్‌, ఐసీఎంఆర్‌-నిన్‌, తార్నాక, హైదరాబాద్‌ – 500007 అడ్ర‌స్‌కు పంపించాలి.
  • అభ్య‌ర్థుల‌ను మొద‌ట అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
  • ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు పోస్టుల‌ను అనుస‌రించి రూ. 25,000 నుంచి రూ. 50,000 వ‌ర‌కు చెల్లిస్తారు.
  • ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 10-02-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

పూర్తి వివ‌రాల కోసం ఈ క్రింద లింకు చెయ్యగలరు.

https://www.nin.res.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com