నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఉద్యోగాలు..
- January 23, 2022
ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖకి చెందిన ఈ సంస్థ హైదరాబాద్ క్యాంపస్‌లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
- నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- వీటిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫిజియాలజీ) 01, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ (కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఫార్మ్ డి) 02, ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ – 01 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
- పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఫార్మ్‌డీ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
- అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
- ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- దరఖాస్తులను డైరెక్టర్, ఐసీఎంఆర్-నిన్, తార్నాక, హైదరాబాద్ – 500007 అడ్రస్‌కు పంపించాలి.
- అభ్యర్థులను మొదట అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు చెల్లిస్తారు.
- దరఖాస్తుల స్వీకరణకు 10-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు చెయ్యగలరు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!