దుబాయ్ లో తొలి ఎడారి అంబులెన్స్ ప్రారంభం

- January 25, 2022 , by Maagulf
దుబాయ్ లో తొలి ఎడారి అంబులెన్స్ ప్రారంభం

యూఏఈ: దుబాయ్‌లో మొట్టమొదటిసారిగా ఎడారి అంబులెన్స్ ను ప్రారంభించారు. అరబ్ హెల్త్ 2022లో భాగంగా కొత్త 4X4 ఎడారి అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. గల్ఫ్‌లో ఉన్న విశాలమైన  ఎడారిలో ఎక్కువగా గేమ్స్ జరుగుతుంటాయి. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ అంబులెన్స్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో సురక్షితంగా, వేగంగా రోగిని సమీప హాస్పిటల్ కు చేరవేసేందుకు అంబులెన్స్ డ్రైవర్ కు ప్రత్యేకంగా ట్రైనింగ్ అందజేశారు.  ఎడారి, పర్వతాలకు సులువుగా వెళ్లేందుకు ఈ అంబులెన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇందులో ఒకేసారి ఏడుగురు రోగులను తీసుకెళ్లవచ్చు. రోగి పరిస్థితిని ముందుగానే హాస్పిటల్ కు తెలియజేయడానికి వైఫై, లైవ్ కెమెరాను కూడా అమర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com