భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- January 25, 2022 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ:  భారత్‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. తాజాగా దేశంలో 2,55,874 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి కంటే 50,190 కేసులు త‌క్కువ‌గా కేసులు న‌మోద‌య్యాయి. అయితే, గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 614 మంది క‌రోనాతో మృతి చెందారు. 2,67,753 మంది కొలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. ఇక దేశంలో ప్ర‌స్తుతం 22,36,842 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 15.52శాతంగా ఉన్న‌ది. క‌రోనా కేసులు పెరుగుతున్నా గ‌తంలో మాదిరిగా పెద్ద‌గా తీవ్ర‌త క‌నిపించ‌డంలేదు. పైగా ఇప్ప‌టికే దేశంలో కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకోవ‌డంతో వైర‌స్ తీవ్ర‌త‌కు బ్రేకులు ప‌డుతున్నాయి. మ‌రోవైపు ప్ర‌జ‌లు కూడా జాగ్ర‌త్తలు తీసుకుంటుండ‌టంతో క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం ఈజీ అయింద‌ని చెప్పుకోవ‌చ్చు. క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్ల చాలా కాలంగా ప్ర‌భుత్వాలు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com