దుబాయ్ లో తొలి ఎడారి అంబులెన్స్ ప్రారంభం
- January 25, 2022
యూఏఈ: దుబాయ్‌లో మొట్టమొదటిసారిగా ఎడారి అంబులెన్స్ ను ప్రారంభించారు. అరబ్ హెల్త్ 2022లో భాగంగా కొత్త 4X4 ఎడారి అంబులెన్స్ ను అందుబాటులోకి తెచ్చారు. గల్ఫ్‌లో ఉన్న విశాలమైన ఎడారిలో ఎక్కువగా గేమ్స్ జరుగుతుంటాయి. ఈ క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఈ అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో సురక్షితంగా, వేగంగా రోగిని సమీప హాస్పిటల్ కు చేరవేసేందుకు అంబులెన్స్ డ్రైవర్ కు ప్రత్యేకంగా ట్రైనింగ్ అందజేశారు. ఎడారి, పర్వతాలకు సులువుగా వెళ్లేందుకు ఈ అంబులెన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ఇందులో ఒకేసారి ఏడుగురు రోగులను తీసుకెళ్లవచ్చు. రోగి పరిస్థితిని ముందుగానే హాస్పిటల్ కు తెలియజేయడానికి వైఫై, లైవ్ కెమెరాను కూడా అమర్చారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!