ఏపీ కరోనా అప్డేట్
- January 25, 2022
అమరావతి: ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13వేల 819 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనాతో మరణించారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో చనిపోయారు. మరోవైపు నిన్న ఒక్కరోజే 5వేల 716 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు లక్ష దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన వాటిలో విశాఖలో అత్యధికంగా 1988 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో 1589, గుంటూరు జిల్లాలో 1422, అనంతపురం జిల్లాలో 1345 కేసులు, నెల్లూరు జిల్లాలో 1305 కేసులు వెలుగుచూశాయి. కాగా, రాష్ట్రంలో నిన్న 14వేల 502 కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య కాస్త తగ్గింది.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,08,955 కి చేరింది. అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,92,998గా ఉంది. గడిచిన 24 గంటల్లో 46వేల 929 కరోనా టెస్టులు చేశారు.ఇప్పటివరకు రాష్ట్రంలో 3,22,34,226 కోవిడ్ టెస్టులు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్