తెలంగాణకు 8 మెడికల్ కాలేజీలు మంజూరు
- January 26, 2022
తెలంగాణ: రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరించారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్. అనంతరం.. గవర్నర్ తమిళ్ సై మాట్లాడుతూ.. ప్రధాని మోడీ జిల్లాకు మెడికల్ కాలేజి ఇస్తున్నారని.. ఇందులో భాగంగానే.. తెలంగాణ రాష్ట్రానికి 8 మెడికల్ కాలేజి లు మంజూరు అయ్యాయని చెప్పారు.
మరుగున పడిన వ్యక్తులను గౌరవించడం ద్వారా భారతదేశం తన నిజమైన చరిత్రను వారసత్వాన్ని తిరిగి పొందుతుందని.. 150 దేశాలకు భారతదేశం వ్యాక్సిన్ ఇచ్చిందని తెలిపారు. మన దేశం ఫార్మసీ, వ్యాక్సిన్ కాపిటల్ ఆఫ్ వరల్డ్ గా పిలువబడుతుందని.. మోడీ కృషి వల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఇచ్చిందని చెప్పారు.
కొత్త రాష్ట్రము అయిన తెలంగాణ వివిధ రంగాల్లో దూసుకుపోతుందని.. హైదరాబాద్ ఫార్మా, మెడికల్,ఐటీ హబ్ గా మారిందని చెప్పారు. నాణ్యమైన ఉన్నత విద్యలో తెలంగాణ అగ్రగామిగా ఎదగాలని, ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ని ప్రోత్సహించి ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కోరుకొంటున్నానని వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!