భారత్ కరోనా అప్డేట్

- January 27, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. తాజాగా దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 2,86,384 కేసులు న‌మోద‌వ్వ‌గా, 573 మంది క‌రోనాతో మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 3,06,357 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రిక‌వ‌రీ కేసులు కాస్త పెర‌గ‌డం ఊట‌ర‌నిచ్చేవిష‌యం. ఇక దేశంలో 22,02,472 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం పాజిటివిటీ రేటు 19.59శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 163,84,39,207 మందికి వ్యాక్సినేష‌న్ అందించారు. మూడో డోస్ కొన‌సాగుతోంది.

దేశంలో వీలైనంత త్వ‌ర‌గా రెండో డోసు కార్య‌క్ర‌మం పూర్తి చేయాల‌ని కేంద్రం అన్ని రాష్ట్రాల‌ను ఆదేశించింది. ప్ర‌స్తుతం హెల్త్ వ‌ర్క‌ర్లు, క‌రోనా ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌, 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఆరోగ్య‌స‌మ‌స్య‌లు ఉన్న వారికి వైద్యుల స‌ల‌హా మేర‌కు ప్రైవేటులో మూడో డోసు అందిస్తున్నారు. థ‌ర్డ్ వేవ్ ఉధృతి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ తీవ్ర‌త తక్కువ‌గా ఉండ‌టంతో క‌రోనా బారిన ప‌డినా త్వ‌ర‌గా కోలుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com