ఏపీ కరోనా అప్డేట్
- January 27, 2022
అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమౌతున్నాయి. బుధవారం 13వేల 618 కరోనా కేసులు నమోదయితే…గత 24 గంటల్లో 13 వేల 474 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు 2022, జనవరి 27వ తేదీ గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 41 వేల 771 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించింది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నమోదైన మొత్తం 22,33,152 పాజిటివ్ కేసులకు గాను 21,09,080 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.
14,579 మంది మరణించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,09,493గా ఉందని తెలిపింది. కరోనా కారణంగా విశాఖపట్టణంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు బులెటిన్ లో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 10,290 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,23,25,140 శాంపిల్స్ పరీక్షించారు.
జిల్లాల వారీగా:
అనంతపురం 980. చిత్తూరు 328. ఈస్ట్ గోదావరి 1066. గుంటూరు 1342. కడప 2031. కృష్ణా 873. కర్నూలు 1835. నెల్లూరు 1007. ప్రకాశం 1259. శ్రీకాకుళం 259. విశాఖపట్టణం 1349. విజయనగరం 469. వెస్ట్ గోదావరి 676 : మొత్తం – 13,474
తాజా వార్తలు
- తెలంగాణ కరోనా అప్డేట్
- టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ గా సింగిరెడ్డి నరేష్ రెడ్డి
- ఈద్ అల్ అదా 2022: చూచాయిగా తేదీ వెల్లడి
- కిడ్నాప్ కేసులో పది మంది అరెస్ట్
- సబ్ కాంట్రాక్టర్‌కి 50,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాలని ఆదేశం
- ఖతార్: త్రీడీ ప్రింటింగ్ ద్వారా భవిష్యత్తులో రోబోలు ఆసుపత్రుల్ని నిర్మించవచ్చు
- తొలి నైపుణ్య కేంద్రాన్ని ప్రారంభించిన సౌదీ, హువావే
- తెలంగాణ డీజీపీ ఫొటోతో జనాలకు సైబర్ నేరగాళ్ల వల
- కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- జూలై నెలలో 14రోజులు బ్యాంకులకు బంద్..సెలవులు