యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ ప్రారంభించిన భారత ఎంబసీ
- January 27, 2022
మనామా: భారత గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో బహ్రెయిన్‌లోని భారత ఎంబసీ, ఓ కొత్త వెబ్సైట్ ప్రారంభించడం జరిగింది. యూజర్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దారు.http://eoibahrain.gov.in పేరుతో ప్రారంభమైన వెబ్సైట్, ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని అందిస్తుంది. కాగా, ఆత్మనిర్భర్ కార్నర్ అలాగే ఆయుర్వేద గార్డెన్ కూడా ఎంబసీ ప్రాంగణంలో ఈ సందర్భంగా ప్రారంభించారు. భారత ట్రైబల్ సంస్కృతి, సంప్రదాయ కళలు వంటి వాటిని చాటి చెప్పేందుకు ఈ కార్నర్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉత్పత్తులకు మార్కెటింగ్ కలిపించేందుకు ఈ చర్యలు చేపట్టారు. కాగా, ఆయుర్వేద గార్డెన్‌ని భారత మహిళా అసోసియేషన్, లులు గ్రూప్ సౌకర్యంతో తీర్చిదిద్దడం జరిగింది. ఆరోగ్యానికి ఆయుర్వేదం అనే నినాదంతో ఈ గార్డెన్ ఏర్పాటు చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఆయుర్వేదానికి పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో వీటికి మరింతగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ బులెటిన్ ద్వారా గత ఏడాదిలో తాము చేపట్టిన కార్యక్రమాల వివరాల్ని పేర్కొన్నారు. కాగా, భారత రిపబ్లిక్ దినోత్సవ సంబరాల్ని కూడా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారత రాష్ట్రపతి సందేశాన్ని రాయబారి పియుష్ శ్రీవాత్సవ చదివి వినిపించారు. గాంధీ పుస్తకాన్ని కూడా ప్రారంభించారు. ఇస్లామిక్ మరియు అరబ్ ప్రపంచంతో గాంధీకి వున్న సంబంధాల గురించి ఇందులో పేర్కొన్నారు. అబ్దుల్ నబి అల్ షోలా ఈ పుస్తకాన్ని రాశారు. ఇంగ్లీషు, హిందీ,ఉర్దూ మరియు మలయాళం భాషల్లో దీన్ని రూపొందించారు. వర్చువల్ విధానంలో 250 మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి