భారత్ కరోనా అప్డేట్
- January 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా దేశంలో 2,51,209 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 627 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య నిన్నటి కంటే స్వల్పంగా పెరిగింది. అయితే,కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 24 గంటల వ్యవధిలో 3,47,443 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దేశలో ప్రస్తుతం 21,05,611 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 15.88శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 164,44,73,216 వ్యాక్సిన్ డోసులు అందించారు. మూడో వేవ్ కారణంగా ప్రికాషనరీ డోస్‌ను అందిస్తున్నారు. కరోనా మహమ్మారికి అందిస్తున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్లు బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులు కేంద్రం మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!