లుసైల్ డ్రైవ్-త్రూ సెంటర్ లో టెస్టింగ్, వ్యాక్సినేషన్ ప్రారంభం

- January 28, 2022 , by Maagulf
లుసైల్ డ్రైవ్-త్రూ సెంటర్ లో టెస్టింగ్, వ్యాక్సినేషన్ ప్రారంభం

దోహా: లుసైల్‌లోని డ్రైవ్-త్రూ కోవిడ్-19 టెస్టింగ్, వ్యాక్సిన్ సదుపాయం జనవరి 26 నుంచి అందుబాటులోకి వచ్చిందని పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ (MoPH) ప్రకటించింది. డ్రైవ్-త్రూ సెంటర్‌లోని పది లేన్‌లలో, ఆరింటిని బూస్టర్ వ్యాక్సిన్ లకు, మిగిలిన నాలుగు లేన్‌లను కోవిడ్-19 పరీక్షను నిర్వహించడానికి కేటాయించారు. అపాయింట్‌మెంట్ సిస్టమ్‌ని ఉపయోగించి బూస్టర్ డోసుల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ముందుగా వచ్చిన వారికి ముందుగా అందజేస్తారు. ఖతార్‌లో ఇప్పటివరకు  మొత్తం 675,049 కోవిడ్-19 బూస్టర్ వ్యాక్సిన్లను అందజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com