సేఫ్ గ్యాప్ వదలని 45 వేల వెహికిల్స్ కు ఫైన్

- January 28, 2022 , by Maagulf
సేఫ్ గ్యాప్ వదలని 45 వేల వెహికిల్స్ కు ఫైన్

అబుధాబి: వాహనాల వెనుక సేఫ్ గ్యాప్ వదలనందుకు 2021లో అబుధాబిలో 45,269 ఫైన్ లను అబుధాబి పోలీస్ (ADP) ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ విధించింది. అదే సమయంలో సేఫ్ గ్యాప్ వదలని కారణంగా కలిగే ప్రమాదాల గురించికూడా హెచ్చరించింది. ఇలాంటి చర్యలతో ట్రాఫిక్ ప్రమాదాలు సంభవిస్తాయని, తమను, ఇతరులకు ప్రమాదకరమని పేర్కొంది. డ్రైవర్లు ఎల్లప్పుడూ ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. పొగమంచు, వర్షం కారణంగా ఏర్పడే అసురక్షిత పరిస్థితుల్లో వాహనాల మధ్య వదిలిన సేఫ్ డిస్టెన్స్ తో ప్రమాదాలను నివారించవచ్చని డైరెక్టరేట్ డ్రైవర్లకు సూచించింది. 2020 నాటి చట్టం నంబర్ 5 ప్రకారం రెండు కార్ల వెనుక సేఫ్ గ్యాప్ వదలడం తప్పనిసరి అని గుర్తు చేసింది. సేఫ్ గ్యాప్ వదలకుండా.. ప్రమాదాలకు కారణమైన వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించింది. ఆ వాహనాన్ని సీజ్ చేసిన తేదీ నుండి మూడు నెలలలోపు Dhs5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ జరిమానాను మూడు నెలల్లో చెల్లించకపోతే సదరు వాహనాన్ని బహిరంగ వేలం యార్డుకు తరలిస్తామని వెల్లడించింది.అంతేకాకుండా, 2017 కోసం ట్రాఫిక్ నిబంధనలు 178లోని ఆర్టికల్ 52 ప్రకారం  వాహనదారులపై 400 Dhs జరిమానా, నాలుగు ట్రాఫిక్ పాయింట్లు విధించబడుతుందని వార్నింగ్ ఇచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com