బీజింగ్ వింటర్ ఒలింపిక్స్-2022 ప్రారంభ వేడుకలకు క్రౌన్ ప్రిన్స్
- January 29, 2022
రియాద్: క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఫిబ్రవరి 4న బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు రియాద్‌లోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ పర్యటన గ్లోబల్ ఒలింపిక్ ఫీల్డ్ అభివృద్ధికి, చైనా-సౌదీ సమగ్ర వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఒక వారంలో ప్రారంభమవ్వనున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆటలను బయో బబుల్ లో నిర్వహించనున్నారు. దీంతో సమ్మర్, వింటర్ గేమ్స్ రెండింటికీ ఆతిథ్యమిచ్చే మొదటి నగరంగా బీజింగ్ నిల్వనుంది. బర్డ్స్ నెస్ట్ స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకను ప్రఖ్యాత చైనీస్ డైరెక్టర్ జాంగ్ యిమౌ పర్యవేక్షించనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి