బీజింగ్ వింటర్ ఒలింపిక్స్-2022 ప్రారంభ వేడుకలకు క్రౌన్ ప్రిన్స్

- January 29, 2022 , by Maagulf
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్-2022 ప్రారంభ వేడుకలకు క్రౌన్ ప్రిన్స్

రియాద్: క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఫిబ్రవరి 4న బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు రియాద్‌లోని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ పర్యటన గ్లోబల్ ఒలింపిక్ ఫీల్డ్ అభివృద్ధికి, చైనా-సౌదీ సమగ్ర వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఒక వారంలో ప్రారంభమవ్వనున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆటలను బయో బబుల్‌ లో నిర్వహించనున్నారు. దీంతో సమ్మర్, వింటర్ గేమ్స్ రెండింటికీ ఆతిథ్యమిచ్చే మొదటి నగరంగా బీజింగ్ నిల్వనుంది. బర్డ్స్ నెస్ట్ స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకను ప్రఖ్యాత చైనీస్ డైరెక్టర్ జాంగ్ యిమౌ పర్యవేక్షించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com