ఒకప్పటి స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి పెద్ద అభిమాని !!
- January 29, 2022
హైదరాబాద్: మణిరత్నం క్లాసిక్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటైన ‘రోజా’లో తన అద్భుతమైన నటనతో ప్రజల హృదయాలను దోచుకున్న నటి మధుబాల. శనివారం నాడు ఈ బ్యూటీ తాను నటి సాయి పల్లవికి అతి పెద్ద అభిమానిని అని పేర్కొంది. మధుబాల ట్విట్టర్లో ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ “అందరికీ హాయ్, నేను నిన్న ‘శ్యామ్ సింఘా రాయ్’ చూశాను. ఇది నేను ఇటీవల చూసిన అత్యంత అద్భుతమైన చిత్రం. నేను సాయి పల్లవికి పెద్ద అభిమానిని” అంటూ చెప్పుకొచ్చింది. ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ నేచురల్ బ్యూటీకి ఫిదా కావడం విశేషమని చెప్పాలి. సీనియర్ నటి నుండి వచ్చిన ఈ కాంప్లిమెంట్‌కి సాయి పల్లవి నిజంగానే పొంగిపోయింది. ఆమె మధుకు రిప్లై ఇస్తూ మీ మాటలకు చాలా పొంగిపోయాను మేడమ్ అని ట్వీట్ చేసింది.
గత ఏడాది డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలైన రాహుల్ సంకృత్యాన్ ‘శ్యామ్ సింఘా రాయ్’ ఈ ఏడాది జనవరి 21 నుంచి ఓటిటి ప్లాట్ఫామ్లో ప్రసారం అవుతోంది. ఓటిటిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ‘శ్యామ్ సింఘా రాయ్’ పలువురు సెలెబ్రటీలను మెప్పిస్తున్నాడు. ఇందులో నాని రచయితగా, సంఘ సంస్కర్తగా నటించగా, కృతి శెట్టి మోడ్రన్ అమ్మాయిగా, సాయి పల్లవి దేవదాసి పాత్రలో కన్పించి మెప్పించారు.
I feel like I received a warm hug, I’m so overwhelmed🥺🙈 Thank you so much for the kind words, ma’am ♥️ lots of love to you ♥️🙏🏻 https://t.co/fjK1joF7P9
— Sai Pallavi (@Sai_Pallavi92) January 29, 2022
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!