శంషాబాద్‌ విమానాశ్రయంలో సౌదీ అరేబియా కరెన్సీ పట్టివేత

- January 29, 2022 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో సౌదీ అరేబియా కరెన్సీ పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు.అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించి, ఎమిరేట్స్ EK-527 విమానం ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.33,000 సౌదీ అరేబియా రియాల్స్‌ను పట్టుకోగా.. వాటి విలువ భారతీయ కరెన్సీలో రూ.6.60లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. సదరు వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com