ఫేక్ వెబ్సైట్ల ద్వారా తక్కువ ధరకే ఫాస్ట్ ఫుడ్: ఈ స్కాం లో పడకండి
- January 29, 2022
బహ్రెయిన్: పలు వెబ్సైట్లలో తక్కువ ధరలకే నోరూరించే ఫాస్ట్ ఫుడ్ ప్రకటనల్ని చూశారా.? వాటి వైపు ఆకర్షితులైతే మాత్రం, మీ బ్యాంక్ అక్కౌంట్ల నుంచి సొమ్ములు గల్లంతైపోతాయి. మహేష్ అనే ఓ బహ్రెయిన్ రెసిడెంట్, అలా ఓ లింక్ క్లిక్ చేసి, 600 బహ్రెయినీ దినర్లను తన అకౌంట్ నుంచి కోల్పోయాడు. 1 దినార్ 100 ఫిల్స్ ఓ బర్గర్ కోసం చెల్లించేందుకు ప్రయత్నించగా, 600 బహ్రెయినీ దినార్లు తన అకౌంట్ నుంచి మాయమయ్యాయని మహేష్ పేర్కొన్నారు. దినార్లలో కాకుండా పౌండ్ల రూపంలో వారు డబ్బు కాజేసినట్లు చెప్పారు మహేష్. బ్యాంకుకి అలాగే పోలీసులకు ఈ మోసంపై మహేష్ ఫిర్యాదు చేశారు. ప్రముఖ సంస్థల వెబ్సైట్లలానే కనిపిస్తాయిగానీ, చిన్న చిన్న మార్పులు వుంటాయనీ, వాటిని గుర్తించడం సులువే అయినప్పటికీ, ఓవర్ లుక్లో తప్పులు జరుగుతుంటాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..