ఘనంగా దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ మొదటి వార్షికోత్సవం

- January 30, 2022 , by Maagulf
ఘనంగా దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ మొదటి వార్షికోత్సవం

దోహా: ఖతార్లోని చాలా ప్రసిద్ధ సంగీత బృందం దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ఇటీవల IICCలో తన మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు మరియు మ్యూజిక్ అభిమానులు హాజరయ్యారు.

దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ఖతార్ లోని వర్ధమాన కళాకారులకు సంగీత వేదికను అందించాలనే లక్ష్యంతో గత సంవత్సరం జనవరి 2021న ప్రారంభించబడింది.దోహాకు చెందిన అనేక మంది యువ,ప్రతిభావంతులైన గాయకులు మరియు నృత్యకారులు ప్రారంభం నుండి ఈ అసోసియేషన్ లో చేరారు.

దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ కు అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది.దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ మొదటి వార్షికోత్సవానికి జియాద్ ఉస్మాన్(ICBF ప్రెసిడెంట్), వినోద్ నాయర్(ICBF వైస్ ప్రెసిడెంట్), KS ప్రసాద్ (ICC అడ్వైజరీ కౌన్సిల్ చైర్పర్సన్), ICBFలో రజనీ మూర్తి మెడికల్ క్యాంపుల ఇంచార్జ్, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్, ICBFలో ఇన్సూరెన్స్ హెడ్ దినేష్ గౌడ్, ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల, తెలంగాణ గల్ఫ్ సమితి ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ బొద్దు, తెలంగాణ జాగృతి ఖతార్ వైస్ ప్రెసిడెంట్ హారిక, సెంట్రల్ ఇండియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయెల్, అశోక్ రాజ్ కోశాధికారి, CIA యొక్క వందన రాజ్ జాయింట్ సాంస్కృతిక కార్యదర్శి మరియు రిచా గోయెల్ పబ్లిక్ రిలేషన్స్ సెక్రటరీ తదితరులు హాజరయ్యారు.

దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ సింగర్లు మరియు డ్యాన్సర్లు మోహిందర్ జలంధరి, జావీద్ బజ్వా, శివ ప్రియ, జంషైద్ బజ్వా, ఆరిఫ్ రయీస్, వెంకప్ప, మధు వంటేరు, అస్లాం చెనియేరి, రెజిన్, కవితా మురుగన్, పూజా మురుగన్, శ్రుతి కడప, ముత్తుమీనల్, అరుణ్ లక్ష్మణన్, వినోద్ నాయర్, సారా అలీ ఖాన్ మరియు ఫాతిమా షాజా, తమ అద్భుతమైన ప్రదర్శనలతో వేదిక వద్ద ఉన్న ప్రతి ఒక్కరినీ ఆట పాటలతో అలరించారు. మోహిందర్ జలంధరి పాటకు హాజరైన ప్రేక్షకులు ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ చేసారు.  సయ్యద్ రఫీ మరియు అతని బృందం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  

ICBF ప్రెసిడెంట్ జియాద్ ఉస్మాన్ మాట్లాడుతూ... అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సయ్యద్ రఫీని అభినందించారు. ICBF వైస్ ప్రెసిడెంట్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాన్ని చాలా సులభంగా మరియు వృత్తి నైపుణ్యంతో నిర్వహించడం అంత సులువైన పని కాదని, అన్ని అంచనాలను అధిగమించినందుకు సయ్యద్ రఫీ మరియు అతని బృందానికి అభినందనలు తెలిపారు.KS ప్రసాద్ ICC అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ... దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ప్రారంభమైనప్పటి నుండి దాని అభివృద్ధిని నిశితంగా గమనిస్తున్నానని మరియు దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ మొదటి రోజు నుండి నేటి వరకు చాలా మంది సంగీత ప్రముఖులు గ్రూప్లో చేరడంతో ఎలా మారిందో గమనించానని చెప్పారు, దాన వరల్డ్ కాంట్రాక్టింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గద్దె శ్రీనివాస్ మాట్లాడుతూ.... అన్ని అంచనాలను మించి అద్భుతమైన కార్యక్రమం అని,సయ్యద్ రఫీతో తన అన్ని వెంచర్లలో అనుబంధం కలిగి ఉండటం సంతోషంగా ఉందని అన్నారు.
ప్రముఖ కవయిత్రి వందనా రాజ్ దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ మరిన్ని విజయవంతమైన వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు మరియు ప్రతి దానిలో తాను భాగం పంచుకోవాలని తన కోరికను వ్యక్తం చేసారు.ICBFలో మెడికల్ క్యాంప్స్ & మెడికల్ అసిస్టెన్స్ హెడ్ రజనీ మూర్తి మాట్లాడుతూ.... గత సంవత్సరం దోహా మ్యూజిక్ లవర్స్ గ్రూప్ ప్రారంభించబడినప్పుడు తాను కూడా అక్కడే ఉన్నానని మరియు దాని మొదటి వార్షికోత్సవ వేడుకల్లో కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.దోహాలోని ప్రముఖ పంజాబీ గాయకుడు మోహిందర్ జలంధరి వందనతో పాటు ఈకార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు.సయ్యద్ రఫీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు,మ్యూజిక్ అభిమానులు  మరియు ఆహ్వానితులందరికీ ధన్యవాదాలు తెలిపారు. 


--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com