కెన‌డాలో ఉద్రిక్తంగా మారిన ప‌రిస్థితులు...

- January 30, 2022 , by Maagulf
కెన‌డాలో ఉద్రిక్తంగా మారిన ప‌రిస్థితులు...

ఒట్టావా: కెన‌డాలో ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి. క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. వ్యాక్సిన్‌ను త‌ప్ప‌నిస‌రి చేయ‌డంతో పాటుగా భౌతిక‌దూరం పాటించాల‌ని, మాస్క్ ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది. నిబంధ‌న‌ల‌కు క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌టంతో అక్క‌డి ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన అసంతృప్తి మొద‌లైంది. దేశంలో ఓ వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు నిబంధ‌న‌ల‌ను మ‌రింత క‌ఠినం చేయ‌డంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ట్ర‌క్ డ్రైవ‌ర్లు వేలాది ట్ర‌క్కుల‌తో రాజ‌ధానికి వ‌చ్చి నిర‌స‌న‌లు చేసేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు. దీంతో రాజ‌ధాని వ‌చ్చే ర‌హ‌దారుల‌న్నీ ట్రక్కుల‌తో నిండిపోయాయి.

ఈ ట్ర‌క్కుల‌న్నీ రాజ‌ధానికి చేరుకుంటే హింస చెల‌రేగే అవ‌కాశం ఉంటుంద‌ని భావించిన అధికారులు హుటాహుటిన ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడోను ఆయ‌న కుటుంబంతో స‌హా ర‌హ‌స్య‌ప్రాంతానికి హుటాహుటిన త‌ర‌లించారు. ఇక ఇప్ప‌టికే రాజ‌ధానికి చేరుకున్న కొంత‌మంది ఆందోళ‌నకారులు భీభ‌త్సం సృష్టిస్తున్నారు. వార్ మెమోరియ‌ల్ ఎక్కి కొంత‌మంది నృత్యాలు చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. దేశంకోసం అమ‌రులైన వారిని కించ‌ప‌రుస్తున్నార‌ని ఆ దేశ ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి అనితా ఆనంద్ స్ప‌ష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com