కెనడాలో ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు...
- January 30, 2022
ఒట్టావా: కెనడాలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. వ్యాక్సిన్ను తప్పనిసరి చేయడంతో పాటుగా భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. నిబంధనలకు కఠినంగా అమలు చేస్తుండటంతో అక్కడి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. దేశంలో ఓ వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నిబంధనలను మరింత కఠినం చేయడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ట్రక్ డ్రైవర్లు వేలాది ట్రక్కులతో రాజధానికి వచ్చి నిరసనలు చేసేందుకు తరలి వస్తున్నారు. దీంతో రాజధాని వచ్చే రహదారులన్నీ ట్రక్కులతో నిండిపోయాయి.
ఈ ట్రక్కులన్నీ రాజధానికి చేరుకుంటే హింస చెలరేగే అవకాశం ఉంటుందని భావించిన అధికారులు హుటాహుటిన ప్రధాని జస్టిన్ ట్రూడోను ఆయన కుటుంబంతో సహా రహస్యప్రాంతానికి హుటాహుటిన తరలించారు. ఇక ఇప్పటికే రాజధానికి చేరుకున్న కొంతమంది ఆందోళనకారులు భీభత్సం సృష్టిస్తున్నారు. వార్ మెమోరియల్ ఎక్కి కొంతమంది నృత్యాలు చేయడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. దేశంకోసం అమరులైన వారిని కించపరుస్తున్నారని ఆ దేశ రక్షణశాఖ మంత్రి అనితా ఆనంద్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!