25శాతం ప్రేక్షకులతో ఐపీఎల్ మ్యాచ్‌లు
- January 30, 2022
ముంబై: ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్.. 15వ సీజన్ కు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. వరుసగా మూడో ఏడాది పీడిస్తున్న కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా స్టేడియంలోకి అభిమానులను అనుమతించడం శోచనీయాంశమైపోయింది. దాదాపు స్టేడియాల్లోనికి ఎవరూ రావొద్దని సూచించినా.. ప్రస్తుతం 25శాతం కెపాసిటీతో మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.
మొత్తం నాలుగు వేదికలుగా జరగనున్న లీగ్.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్లేఆఫ్ లు జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. రెండు కొత్త జట్లతో నిర్వహించే లీగ్ మ్యాచ్ లు మొత్తం 70 జరుగుతాయి. అదే సమయంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్ లు జరగనున్నాయి.
వేదికలు ఇంకా కన్ఫామ్ కాకపోయినప్పటికీ కనీసం 25శాతం ప్రేక్షకులతో మ్యాచ్ లు జరుగుతాయి. ముంబై, పూణెలలో కేసుల నమోదు తగ్గితేనే అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించే విషయం ఫైనల్ కాదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
మార్చి చివరి వారంలో మొదలుకావాల్సి ఉన్న ఐపీఎల్ 2022.. రెండు నెలల పాటు జరగనుంది. దాని కంటే ముందు ఫిబ్రవరి 12, 13న మెగా వేలం నిర్వహిస్తుంది ఐపీఎల్ మేనేజ్మెంట్.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!