200 దిర్హామ్‌లు దొంగిలించిన మెకానిక్కు జైలు శిక్ష
- January 31, 2022
దుబాయ్: తన సహోద్యోగి పర్సులోంచి 200 దిర్హామ్‌లు దొంగిలించిన మెకానిక్ కు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ మూడు నెలల జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత సెప్టెంబరులో ఈ ఘటన జరిగింది. పని చేసే ప్రాంతంలో గత నాలుగు నెలలుగా తన పర్సులోంచి పైసలు మాయం అవ్వడం బాధితుడు గమనించాడు. ఈ క్రమంలో రహస్య సీసీ కెమెరా అమర్చాడు. ఈ క్రమంలో మరోసారి తన పర్సు నుండి 200 దిర్హామ్‌లు మాయం అవ్వడం గమనించాడు. వెంటనే తన ఫోన్లోని నిఘా కెమెరాను చెక్ చేయగా.. షాక్ తిన్నాడు. ఓ మెకానిక్ తన వాలెట్‌ను తెరిచి డబ్బులు తీసుకొని తిరిగి యథాతథంగా పెట్టడం గమనించాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు తొలుత నేరాన్ని అంగీకరించలేదు. కానీ సీసీ ఫుటేజీ చూపెట్టిన తర్వాత తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!