కువైట్ లో ఫ్రంట్లైన్ వర్కర్లకు ఫ్రీ ఫుడ్
- January 31, 2022
కువైట్: ఫ్రంట్లైన్ వర్కర్లకు ఫ్రీ ఫుడ్ అందివ్వనున్నట్లు కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రి ఫహద్ అల్-షురైఆన్ ప్రకటించారు. మార్చి 1 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖకు సూచనలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో వారు చూపే తెగువ వెలకట్టలేదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్య, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలు పంపిన డేటా అందిందని, 2020 సంవత్సరానికి సంబంధించిన క్యాబినెట్ రిజల్యూషన్ నంబర్ 807కి అనుగుణంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు నివాస ప్రాంతాలలో ఉన్న పబ్లిక్ హాల్స్ లో ఫుడ్ ఐటమ్స్ సప్లై జరుగుతుందన్నారు. కువైట్ మాజీ అమీర్ దివంగత షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా యొక్క ఆదేశాన్ని నెరవేర్చడానికి ప్రధాన మంత్రి షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా ఇచ్చిన సూచనల మేరకు ఈ ఫ్రీ ఫుడ్ స్కీంను ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!