200 దిర్హామ్‌లు దొంగిలించిన మెకానిక్‌కు జైలు శిక్ష

- January 31, 2022 , by Maagulf
200 దిర్హామ్‌లు దొంగిలించిన మెకానిక్‌కు జైలు శిక్ష

దుబాయ్: తన సహోద్యోగి పర్సులోంచి 200 దిర్హామ్‌లు దొంగిలించిన మెకానిక్ కు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ మూడు నెలల జైలు శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత సెప్టెంబరులో ఈ ఘటన జరిగింది. పని చేసే ప్రాంతంలో గత నాలుగు నెలలుగా తన పర్సులోంచి పైసలు మాయం అవ్వడం బాధితుడు గమనించాడు. ఈ క్రమంలో రహస్య సీసీ కెమెరా అమర్చాడు. ఈ క్రమంలో మరోసారి తన పర్సు నుండి 200 దిర్హామ్‌లు మాయం అవ్వడం గమనించాడు. వెంటనే తన ఫోన్‌లోని నిఘా కెమెరాను చెక్ చేయగా.. షాక్ తిన్నాడు. ఓ మెకానిక్ తన వాలెట్‌ను తెరిచి డబ్బులు తీసుకొని తిరిగి యథాతథంగా పెట్టడం గమనించాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు తొలుత నేరాన్ని అంగీకరించలేదు. కానీ సీసీ ఫుటేజీ చూపెట్టిన తర్వాత తన నేరాన్ని అంగీకరించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com