ఒమన్‌లో చెక్ బౌన్సు కేసులు సర్వసాధారణం.!
- February 01, 2022
మస్కట్: సాధారణ నేరాల జాబితాలో చెక్ బౌన్ కేసులు టాప్ పొజిషన్‌లో నిలిచాయి సంఖ్యా పరంగా. 2021లో 7,000 కేసులు బౌన్స్‌డ్ చెక్కులకు సంబంధించినవి నమోదయ్యాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ అహ్మద్ బిన్ సైద్ అల్ షుకైలి ఈ విషయాన్ని వెల్లడించారు. చెక్ బౌన్స్ (7,143) తర్వాతి స్థానంలో ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ (2,894 కేసులు) నిలిచింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ మొత్తంగా 28,201 కేసుల్ని గత ఏడాదిలో డీల్ చేయడం జరిగింది. మొత్తం క్రిమినల్ కేసుల్లో పెరుగుదల 73గా నమోదయ్యింది 2020తో పోల్చితే. సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి 111 కేసులు నమోదయ్యాయి. వాటిల్లో 55 కేసుల్ని న్యాయస్థానానికి రిఫర్ చేయడం జరిగింది. మానవ అక్రమ రవాణాకి సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. 2021లో మొత్తంగా 34,873 మంది నిందితులుగా తేలారు. 10,350 క్రిమినల్ జడ్జిమెంట్లు వచ్చాయి.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..