బహ్రెయిన్ వలసదారులే టార్గెట్‌గా విజిట్ వీసా నేరాలు

- February 02, 2022 , by Maagulf
బహ్రెయిన్ వలసదారులే టార్గెట్‌గా విజిట్ వీసా నేరాలు

బహ్రెయిన్: దక్షిణాసియా దేశాలకు చెందిన సమర్థులైన యువత లక్ష్యంగా విజిట్ వీసా నేరాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో యువత ఇబ్బందుల్లో కూరుకుపోతుండడం బాధాకరం. 700 బహ్రెయినీ దినార్ల నుంచి 1,200 బహ్రెయినీ దినార్ల మధ్య విజిట్ వీసాలను విక్రయించడం జరుగుతోంది. చాలామంది యువత బహ్రెయిన్ వచ్చాకనే తాము మోసపోయిన విషయాన్ని తెలుసుకుంటున్నారని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. మోసపోయామని తెలుసుకున్నాక తిరిగి తమ స్వదేశానికి బాధగా తిరిగి వెళ్లడమో లేదంటే అక్రమ నివాసితుడిగా బహ్రెయిన్‌లో వుండిపోవడం తప్ప మరో ఆప్షన్ వారికి వుండడంలేదు. ప్రధానంగా ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాలకు చెందిన యువత ఈ తరహా మోసాల బారిన పడుతున్నారు. ఫేక్ రిక్రూట్మెంట్ ఏజెంట్లే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. సోషల్ వర్కర్ గంగన్ త్రికారిపుర్ మాట్లాడుతూ, బాధితులు హాస్పిటాలిటీ అలాగే నిర్మాణ రంగానికి చెందిన స్కిల్ లేని యువత అని చెప్పారు. తమ తమ దేశాల్లో తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఎలాగోలా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలన్న కోణంలో మోసాల బారిన పడుతున్నారు బాధితులు. బాధితుల్లో మహిళలు కూడా ఎక్కువగానే వుంటున్నారు. 9 బహ్రెయినీ దినార్లకు లభ్యమయ్యే వీసాలను 70‌0 బహ్రెయినీ దినార్లకు విక్రయిస్తున్నారు.. అది కూడా మోసపూరితంగా. పలువురు స్పాన్సరర్లు, ఏజెంట్లు.. వీసాలను పెద్దమొత్తంలో సమీకరించి, పెద్ద మొత్తాలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులు కనీసం పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేని పరిస్థితి. కారణం వారు అక్రమంగా వీసాలను పొందడమే. నేషనాలిటీ పాస్‌పోర్ట్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ మరింతగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టి, ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట వేయాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com