జాతీయ జెండా చట్టానికి సవరణల్ని ఆమోదించిన షౌరా కౌన్సిల్

- February 02, 2022 , by Maagulf
జాతీయ జెండా చట్టానికి సవరణల్ని ఆమోదించిన షౌరా కౌన్సిల్

రియాద్: సౌదీ అరేబియా షౌరా కౌన్సిల్, జాతీయ పతాకం, చిహ్నం అలాగే జాతీయ గీతానికి సంబంధించి చట్టానికి సవరణలు చేయడం జరిగింది. ఆకుపచ్చ జెండాపై కత్తి అలాగే ఇస్లామ్ సూక్తుల్ని మరింత స్పష్టంగా తెలిసేలా చూపించనున్నారు. జాతీయ జెండా, జాతీయ గీతం తాలూకు ఆవశ్యకతను మరింత బాగా తెలుసుకునేలా, నిర్లక్ష్యానికి వీలు లేకుండా పలు కీలక చర్యలు తీసుకున్నారు. షౌరా సభ్యుడు సాద్ అల్ ఒతైబి ఈ సవరణను ప్రతిపాదించారు. ఈ సవరణపై షౌరా కౌన్సిల్‌లో చర్చ, ఓటింగ్ జరిగాయి. సవరణల ద్వారా చట్టాల్ని ఉల్లంఘించేవారికి జరీమానాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. యాభయ్యేళ్ళుగా వున్న చట్టానికి తాజాగా సవరణ చేశారు. జాతీయ చిహ్నాన్ని వినియోగించడంపైనా స్పష్టమైన నిబంధనల్ని పేర్కొన్నారు. తగిన అనుమతులు లేకుండా చిహ్నాన్ని వినియోగించడానికి వీల్లేదు. ఉల్లంఘనలకు విధించే జరీమానాలపై స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కమర్షియల్ వినియోగానికి వీల్లేకుండా జాతీయ చిహ్నానికి ప్రత్యేకతల్ని అద్దారు ఈ సవరణల ద్వారా. ఆకుపచ్చని పతాకంపై తెల్లటి అక్షరాలతో అల్లాని మించిన దైవం లేదు.. అల్లా దూత మొహమ్మద్.. అని జాతీయ పతాకంపై పేర్కొంటారు. జాతీయ జెండా డిజైన్ మార్చి 15, 1973న ఖరారు చేయబడింది. కింగ్ ఫైజల్హయాంలో సౌదీ ఫ్లాగ్ చట్టం రూపొందింది. రెక్టాంగిల్ షేప్‌లో ఈ జెండా వుంటుంది. జాతీయ చిహ్నం 1950లో ఖరారు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com