వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

- February 02, 2022 , by Maagulf
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌లో వాట్సాప్ కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా టైమ్ లిమిట్‌ను మరింత పెంచనుంది. దీంతో తాము పంపిన మెసేజ్‌లను 60 గంటలు (రెండున్నర రోజులు) తర్వాత కూడా ఇద్దరికీ కనిపించకుండా యూజర్లు డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పనితీరును పరిశీలిస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్‌ఫో తెలిపింది.

యూజర్లు తాము పంపిన మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత చాట్ పేజీలో దిస్ మేసేజ్ ఈజ్ డిలీటెడ్ అనే సందేశం కనిపిస్తుంది. ప్రస్తుతం డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌లో ఒక గంట 8 నిమిషాల 16 సెకన్ల కాలపరిమితి ఉంటుంది. దీంతో పాటు గ్రూప్స్‌కు భిన్నంగా కొత్తగా కమ్యూనిటీస్ పేరుతో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకువస్తున్నట్లు గత ఏడాది వాట్సాప్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కూడా బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. కమ్యూనిటీ ఫీచర్‌తో గ్రూప్ అడ్మిన్‌లు వేర్వేరు గ్రూపులను ఒకే చోటకు చేర్చవచ్చు.అంతేకాకుండా ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు మరిన్ని అదనపు ఫీచర్లను ఇస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com