వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
- February 02, 2022
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్లో వాట్సాప్ కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా టైమ్ లిమిట్‌ను మరింత పెంచనుంది. దీంతో తాము పంపిన మెసేజ్‌లను 60 గంటలు (రెండున్నర రోజులు) తర్వాత కూడా ఇద్దరికీ కనిపించకుండా యూజర్లు డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పనితీరును పరిశీలిస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.
యూజర్లు తాము పంపిన మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత చాట్ పేజీలో దిస్ మేసేజ్ ఈజ్ డిలీటెడ్ అనే సందేశం కనిపిస్తుంది. ప్రస్తుతం డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌లో ఒక గంట 8 నిమిషాల 16 సెకన్ల కాలపరిమితి ఉంటుంది. దీంతో పాటు గ్రూప్స్‌కు భిన్నంగా కొత్తగా కమ్యూనిటీస్ పేరుతో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకువస్తున్నట్లు గత ఏడాది వాట్సాప్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ కూడా బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. కమ్యూనిటీ ఫీచర్‌తో గ్రూప్ అడ్మిన్లు వేర్వేరు గ్రూపులను ఒకే చోటకు చేర్చవచ్చు.అంతేకాకుండా ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్లకు మరిన్ని అదనపు ఫీచర్లను ఇస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!