ఎక్స్ పో 2020 దుబాయ్.. దుబాయ్ ప్రిన్స్ తో కేరళ సీఎం భేటీ
- February 03, 2022
దుబాయ్: కేరళ సీఎం పినరయి విజయన్ ఎక్స్ పో 2020 దుబాయ్ ని సందర్శించారు. ఈ సందర్భంగా యూఏఈ పెవిలియన్‌లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హెచ్.హెచ్. షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి, భవిష్యత్ భాగస్వామ్యానికి అవకాశాలపై వారు చర్చించారు. అంతకుముందు ఎక్స్‌పో 2020 దుబాయ్‌లోని ఇండియన్ పెవిలియన్‌లో జరిగిన ‘కేరళ వీక్’కు హాజరైన కేరళ ముఖ్యమంత్రిని షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ స్వాగతించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రెసిడెంట్, దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ అండ్ గ్రూప్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెచ్‌హెచ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్, ఇంటర్నేషనల్ కోపరేషన్ స్టేట్ మినిస్టర్ అండ్ డైరెక్టర్, ఎక్స్ పో 2020 దుబాయ్ జనరల్ రీమ్ బింట్ ఇబ్రహీం అల్ హషేమీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!