అశోక్ గజపతి రాజు కు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం'

- February 04, 2022 , by Maagulf
అశోక్ గజపతి రాజు కు \'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం\'

విశాఖపట్నం: అంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు సంబరాల సందర్భంగా తెలుగు భాష వికాసానికి కృషి చేసిన విజయనగర సంస్థానికి , నేటి వారసులు అశోక్ గజపతి రాజు దంపతులకు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం' విజయనగరంలో అందించినట్టు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, సురేఖ శ్రీనివాస్ తెలిపారు. అంధ్ర వాఙ్మయ వైభవానికి కృషి చేసిన వివిధ సంస్థానాధీసుల నేటి వారసులను కలవడం, వారి పూర్వీకులు చేసిన సేవలను గురుతు చేసుకోవడం ఎంతో ఆనందం కలిగించిదని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.అశోక గజపతి మాట్లాడుతూ మాతృ  బాష  జాతికి పునాది వంటిదని, దానిని కాపాడు కోవడం అందరి నైతిక బాధ్యత అని, తెలుగు భాష వికాసానికి తన వంతు సహకారం ఎప్పుడూ వుంటుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com