శ్రీవారి భక్తులకు శుభవార్త...
- February 04, 2022
తిరుమల: కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి.. అన్ని అనుకూలిస్తే ఫిబ్రవరి 15వ తేదీ తరువాత శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్లో సామాన్య భక్తులకు కేటాయిస్తామని అన్నారు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి. కరోనా ప్రభావం తగ్గితే మార్చి మొదటివారంలో శ్రీవారం ఆర్జిత సేవలను పునరుద్దరిస్తామని ఆయన స్పష్టంచేశారు. ధర్మారెడ్డిసహా పలువురు సీనియర్ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు.బండరాళ్లు విరిగిపడే ప్రమాదాలను ముందే గుర్తించే సాంకేతికతను త్వరలో తీసుకొస్తామన్నారు. శ్రీవారి టికెట్లను విక్రయించే నకిలీ వెబ్ సైట్లను గుర్తించి డియాక్టివ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. హనుమాన్ జన్మస్థలమైన అంజనాద్రిలో ఫిబ్రవరి 16న అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!