కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై అనుచిత వ్యాఖ్యలు ఉద్యోగి తిలగింపు

- February 05, 2022 , by Maagulf
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై అనుచిత వ్యాఖ్యలు ఉద్యోగి తిలగింపు

కేరళ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఆ రాష్ట్ర సచివాలయ ఉద్యోగి ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడం పై తీవ్ర దుమారం రేగింది.వాట్సాప్ వేదికగా సచివాలయ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలపై సీఎం కార్యాలయ సిబ్బంది స్పందిస్తూ.. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..ఇటీవల యూఏఈలో పర్యటించారు.కేరళ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అక్కడి విదేశీ వాణిజ్య మంత్రిత్వశాఖ, మానవవనరుల అభివృద్ధిశాఖతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా యూఏఈ మంత్రులు, అధికారులతో కలిసి దిగిన ఫోటోను సీఎం పినరయి విజయన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.

సీఎం విజయన్ నల్ల సూట్ వేసుకుని ఉన్న ఆ ఫోటోను.. ఏ.మణికుట్టన్ అనే సచివాలయ ఉద్యోగి తన వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు.'గూండాలు వేర్వేరు వేషధారణలో ఉన్నారు' అంటూ సీఎం పై మణికుట్టన్..అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ విషయాన్నీ కొందరు సచివాలయ అధికారులు సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా..ఈ విషయం పై వచ్చిన ఫిర్యాదు మేరకు మణికుట్టన్‌ను అంతర్గత విచారణ పెండింగ్‌లో ఉంచుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఆర్ జ్యోతిలాల్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com