ఈ నెల 18న విడుదల కానున్న ‘వర్జిన్ స్టోరీ’!
- February 06, 2022
హైదరాబాద్: ప్రముఖ నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీష తనయుడు విక్రమ్ సహిదేవ్ పలు చిత్రాలలో బాలనటుడి పాత్రలు పోషించాడు. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన ‘రౌడీ బాయ్స్’లో అతను ప్రతినాయకుడి తరహా పాత్రను పోషించి, మెప్పించాడు. ఇదిలా ఉంటే… విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన ‘వర్జిన్ స్టోరీ’ మూవీ ఈ నెల 18న జనం ముందుకు రాబోతోంది. ‘కొత్తగా రెక్కలొచ్చెనా అనేది దీని ట్యాగ్ లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ బి అట్లూరి ఈ చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు.
‘ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు ‘మనసా నిన్నలా’, ‘కొత్తగా రెక్కలొచ్చెనా’, ‘బేబీ ఐయామ్ ఇన్ లవ్’ ఛాట్ బస్టర్స్ అయ్యాయని, ఇవన్నీ సినిమాపై పాజిటివ్ బజ్ ను, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయ’ని లగడపాటి శ్రీధర్ తెలిపారు. ‘యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రూపుదిద్దుకున్న ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందని, రొమాంటిక్ హీరోగా విక్రమ్ కు మంచి పేరొస్తుంద’ని దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతాన్ని అందించాడు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్