సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్ వ్యాక్సిన్‌కు అనుమతి
- February 06, 2022
న్యూఢిల్లీ: భారత్‌లో సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు DCGI అనుమతి లభించింది.రెండు డోసుల వ్యాక్సిన్ల తర్వాత.. ఇప్పుడు బూస్టర్ డోసును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది..ఈ సింగిల్ డోసు వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా. భారత్ విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇచ్చిన తర్వాత రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారత్‌లో పంపిణీ చేస్తున్నారు.. 2021 జూన్ నుంచే స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను పంపిణీ జరుగుతోంది.. ఇప్పుడు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగిల్ డోస్ కు అనుమతి లభించింది.. సింగిల్-డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం వచ్చింది.. కోవిడ్ -19కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క పోరాటానికి ఇది మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.. ఇది దేశంలో 9వ కోవిడ్ వ్యాక్సిన్.. ఇది మహమ్మారిపై దేశం యొక్క సమిష్టి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది అంటూ ట్వీట్ చేశారు మన్సుఖ్ మాండవియా. కాగా, గత ఏడాది జూలై 1న, స్పుత్నిక్ లైట్‌కు అనుమతి ఇవ్వడానికి భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ నిరాకరించింది.
DCGI has granted emergency use permission to Single-dose Sputnik Light COVID-19 vaccine in India.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 6, 2022
This is the 9th #COVID19 vaccine in the country.
This will further strengthen the nation's collective fight against the pandemic.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!