భారత్లో కరోనా కేసుల వివరాలు
- February 07, 2022
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 32 రోజుల తర్వాత లక్ష లోపు కేసులు రికార్డయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. గత 24 గంటల్లో కొత్తగా 83 వేల 876 కేసులు నమోదు కాగా.. 895 మరణాలు సంభవించాయని వెల్లడించింది. కేరళలో కొత్తగా 378 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 11, 08, 938 యాక్టివ్ కేసులుండగా 2.62 శాతంగా ఈ కేసులున్నాయని పేర్కొంది. 7.25 శాతానికి చేరుకున్న రోజువారీ పాజిటివిటి రేటు చేరుకోగా దేశంలో ఇప్పటివరకు 4,22,72,014 కేసులు నమోదయ్యాయి. 5,02,874 మరణాలు సంభవించాయి. దేశంలో 96.19 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. ఆదివారం కరోనా నుంచి 1,99,054 మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 4,06,60,202 మంది కోలుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..